రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

Oct 20 2026 4:19 AM | Updated on Oct 20 2026 4:19 AM

నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్‌) : ఆటోను బైక్‌ ఢీకొట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పిట్టావాండ్లపల్లెకు చెందిన ఇమ్మాని(25), ఎర్రాతివారిపల్లెకు చెందిన లోకేష్‌(19) ద్విచక్ర వాహనంలో మదనపల్లికు బయలుదేరారు. అదే సమయంలో మదనపల్లి నుంచి ప్రయాణికులను నిమ్మనపల్లి వైపు తరలిస్తున్న ఆటో రెడ్డివారిపల్లె మలుపు వద్దకు రాగానే బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో.. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురితో పాటు ద్విచక్ర వాహనంలో ఉన్న ఇమ్మాని, లోకేష్‌ గాయపడ్డారు. బాధితులను నిమ్మనపల్లి 108 లో మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కాగా ఆటోలో ఉన్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement