వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు కుట్రలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు కుట్రలు

Oct 20 2026 4:19 AM | Updated on Oct 20 2026 4:19 AM

కడప కార్పొరేషన్‌ : వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదరణను తగ్గించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వ అసమర్థత, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లా నుంచి మొదలుపెట్టి పుంగనూరు మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భయపెట్టడం, నామినేషన్లు వేయకుండా నిరోధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనే ఆంక్షలు ఎందుకు?

టీడీపీ వర్గాలు కర్రలు, కత్తులు, రాడ్లతో తిరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుంటే, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రంం సెక్షన్‌ 144 పేరుతో ఆంక్షలు విధిస్తున్నాన్నారని తెలిపారు. టీడీపీ ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో అడ్డంకులు సష్టించిన వారి పై ఎన్ని కేసులు నమోదు చేశారు? బాధ్యులైన వారిలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాల ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement