మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా హైమావతి నామినేషన్‌ ఆమోదం ! | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా హైమావతి నామినేషన్‌ ఆమోదం !

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకతకు పెద్దపీట

జమ్మలమడుగు: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి సోదరి ఎన్‌. హైమావతి నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు. అదేవిధంగా చైర్‌ పర్సన్‌ అభ్యర్థులుగా 13 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 9 ఆమోదం పొంది నాలుగు నామినేషన్లు తిరస్కరించారు. 32 వార్డులకు గాను మొత్తం 155 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం అధికారులు నిర్వహించిన పరిశీలనలో 11 నామినేషన్లు తిరస్కరించారు. వైఎస్సార్‌సీపీ తరపున మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పొన్నపురెడ్డి ఇందిర నామినేషన్‌ వేయాలనుకున్నా పోలీసులు అడ్డుకోవడంతో వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సొదరి ఎన్‌.హైమావతిని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.

కడప ఎడ్యుకేషన్‌: ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు తావులేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు గణేష్‌ కుమార్‌ తో కలిసి ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా నామినేషన్లు స్కాన్‌ చేసి డిజిటల్‌ రూపంలో భద్రపరచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement