పోలీసుల అదుపులో వైఎస్సార్‌సీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో వైఎస్సార్‌సీపీ నేతలు

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

పోలీసుల అదుపులో వైఎస్సార్‌సీపీ నేతలు మున్సిపల్‌ ఆఫీస్‌లో బీహారోళ్లా ఉన్నారు!

ముద్దనూరు : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ దాఖలు చివరి రోజున ఎర్రగుంట్లకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలను ఆదివారం ముద్దనూరు పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు. ఎర్రగుంట్లకు చెందిన తుంగా వెంకటరామిరెడ్డి, తమ్మిశెట్టి బాలయ్య, సాంబశివారెడ్డి, జయరామకృష్ణారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రగంట్లలోని వారి నివాసాల నుంచి ఉదయమే వారిని పోలీసులు ముద్దనూరుకు తరలించారు. ఉదయం నుంచి స్థానిక పోలీసు స్టేషన్‌లో వున్న వారిని మధ్యహ్నం 3 గంటల తర్వాత విడుదల చేశారు. పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు స్టేషన్‌లో వున్న ఎర్రగుంట్ల నేతలను కలిశారు.

● రాజంపేటలో టీడీపీ నాశనం

● ఆ పార్టీ సీనియర్‌ నాయకుడి ఆవేదన

● నామినేషన్‌ వేయడానికి వెళ్తే.. మాపై దాడి

రాజంపేట : రాజంపేటలో టీడీపీ నాశనమైపోతుందని, మున్సిపల్‌ కార్యాలయంలో బీహారోళ్లా ఉన్నారని స్థానిక 9 వార్డు ముకందరగడ్డకు చెందిన టీడీపీ కరుడుకట్టిన సీనియర్‌ నాయకుడు గౌస్‌పీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన సతీమణితో కలిసి వచ్చి నామినేషన్‌ వేసేందుకు మున్సిపాలిటీ ఆఫీసులోని నామినేషన్‌ స్వీకరణ కేంద్రానికి విచ్చేశారు. ఈయనను లోపలికి పోనివ్వకుండా నామినేషన్‌ పత్రాలను ఆయన భార్య చేతిలో నుంచి బలవంతంగా తీసుకొని, చించిపారేశారు. ఈ సంఘటనపై ఆయన సాక్షితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘టీడీపీలో 30 ఏళ్లుగా పని చేస్తున్నాను. 2019లో జెండా కట్టేవారు లేకపోతే.. పార్టీ లేకపోయినా, వార్డులో పార్టీ జెండా కట్టాను. పార్టీ తరఫున నా భార్యను నిలబెట్టి, వారి దెబ్బకు తట్టుకోలేక వారం రోజులు కుటుంబంతో బయట ఉన్నాను. మళ్లీ వచ్చి నామినేషన్‌ వేశాను. కానీ ఇప్పుడు మన పార్టీ వచ్చిందని నామినేషన్‌ వేసేందుకు మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లాను. నన్ను కొట్టేదానికి వచ్చారు. పేపర్లు చింపి గందరగోళం చేశారు. బీహారోళ్లకన్నా అధ్వాన్నంగా ఉన్నారు.. ఏ పార్టీ వారో తెలియడం లేదు. మున్సిపాలిటీలో బీహారోళ్లు ఉన్నట్లు ఉన్నారు. విచారణ చేసి పార్టీని కాపాడుకునేటట్లు చేసుకోండి, రాజంపేటలో పార్టీ నాశనమైపోతుంది. రాష్ట్రంలో కూడా అంతే. ఏమీ వుండదు. 40 ఏళ్ల నుంచి పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులను, వీరాభిమానులు నాశనం చేస్తున్నారు. అడ్డంగా నరికేస్తున్నారు. రాజంపేటలో పార్టీని నామరూపం లేకుండా చేసేందుకు రెడీ అయ్యారు. మా నామినేషన్‌ పేపర్లను అశోక్‌ తమ్ముడు, పోటీ చేసిన, నామినేషన్‌ వేసిన మహమ్మద్‌అలీ. ఈయన ఈ మధ్యనే రెండు నెలలు అయింది వచ్చి... మా భార్య దగ్గర పేపర్లు లాక్కున్నారు. కొత్తోడు ఉన్నట్లు ఉన్నాడు.. బీహారోడు ఉన్నట్లు కనిపిస్తున్నాడు.. నా రెట్ట పట్టుకొని కొట్టేదానికి వచ్చారు. వీళ్లు పార్టీ అయింది తెలీదు. బీహారోళ్లని తెలియదు’ అంటూ ఆయన వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement