టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు వైఎస్సార్‌సీపీలో చేరిక

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

కేవీపల్లె : అధికార తెలుగుదేశం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. తెలుగు దేశం పార్టీ నుంచి ప్రధాన నాయకుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. మండలంలోని గర్నిమిట్ట పంచాయతీ చింతమాకులపల్లెకు చెందిన వనం రాజశేఖర్‌నాయుడు తెలుగు పార్టీలో మాజీ మండల అధ్యక్షులుగా, మాజీ ఎంపీటీసీగా పని చేశారు. శనివారం రాత్రి తిరుపతిలో రాజంపేట పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువాతో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ మాజీ డైరెక్టర్‌ హరీష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ వెంకటరమణారెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, కోర్టుసుబ్బారెడ్డి, వెంకటసిద్ధులు, గజ్జెల శీన్‌రెడ్డి, చామంచుల సిద్ధయ్య, ఆంజినేయులు, వేణుగోపాల్‌రెడ్డి, జగదీష్‌, యల్లయ్య, కంభం భాస్కర్‌ రెడ్డి, సుబ్బు, కాటంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement