రాజంపేట: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వంలో భాగంగా తొలిరోజు వైఎస్సార్సీపీ అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాజంపేట ఎంపీ పీవీమిథున్రెడ్డిపై పచ్చమూకల దాడి చేయడం హేయమైన చర్యగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథరెడ్డి అభివర్ణించారు. రాజంపేటలోని ఆకేపాటి భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల స్వేచ్ఛాయుత వాతవరణంలో జరగాల్సిందిపోయి, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పతనానికి ఇది నాంది అని ఎద్దేవా చేశారు.
టీడీపీ వైఖరి రాజంపేట చరిత్రలో
మాయని మచ్చ :
రాజంపేట మున్సిపాలిటి ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు వ్యవహారించిన తీరు రాజంపేట చరిత్రలో మాయనిమచ్చగా మిగిలిపోతుందని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్ వేయనీయకుండా పోలీసుల సమక్షంలో అడ్డుకోవడం దారుణమన్నారు. స్వేచ్చాయుత వాతవరణంలో ఎన్నికల నిర్వహించేందుకు సహకరించామని గుర్తుచేశారు. ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన బాధ్యత పోలీసులపై ఎంతైనా ఉందన్నారు. గెలుపోటములు సహజమన్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి, రాజంపేట మున్సిపాలిటి చైర్మన్ పోల శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


