నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిపించండి | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిపించండి

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషాతో కలిసి కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ నామినేషన్‌ కేంద్రాల వద్ద తప్పనిసరిగా సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని కోరారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలుచేసేందుకు వీలుగా అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు చర్య లు చేపట్టాలన్నారు. నామినేషన్ల కార్యక్రమం పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. కడప నగరం మరియాపురంలో చెక్‌లిస్టు సమర్పించిన తర్వాత ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు వాటిని రిటర్నింగ్‌ అధికారి నుంచి లాక్కొని చించివేశారని పేర్కొన్నారు. గాంధీనగర్‌ హైస్కూలు వద్ద వందలాది మంది గుమికూడి తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆర్వో కార్యాలయాల వద్ద నిబంధనలకు విరుద్దంగా గుమికూడకుండా చేసి, తద్వారా ఘర్షణలు, అక్రమాలు జరగకుండా నివారించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే గదుల్లో తప్పనిసరిగా హై డిఫినిషన్‌ సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు పులిసునీల్‌కుమార్‌, జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement