నామినేషన్లకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు వేళాయె

Oct 16 2026 7:47 AM | Updated on Oct 16 2026 7:47 AM

● నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

● ఎన్నికల సిబ్బందితో సమావేశం

సాక్షి, మదనపల్లె: మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి మొదలుకానుంది. మదనపల్లె, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. చైర్మన్‌, వార్డులకు సంబంధించి నామినేషన్‌ స్వీకరణకు ప్రత్యేక గదులను సిద్ధం చేశారు. కేటాయించిన గదిలోనే సంబంధిత నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేయాల్సి ఉంటుంది. మదనపల్లిలో ఒక చైర్మన్‌, 48 వార్డులకు, రాయచోటిలో ఒక చైర్మన్‌, 44 వార్డులకు, పుంగనూరులో ఒక చైర్మన్‌, 36 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు మూడు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు, ఆశావహులు వెనువెంటనే నామినేషన్లను దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సంబంధించి దొంతి లేఅవుట్‌ వద్ద సహాయ ఎన్నికల అథారిటీ నూతన భవనంలో చైర్మన్‌, వార్డుల కౌన్సిలర్‌ నామినేషన్ల స్వీకరణ గదులను అధికారులతో కలిసి గురువారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పరిశీలించారు. దీనికోసం సిద్ధం చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎస్‌డీసీలు చంద్రశేఖర్‌ రెడ్డి, మాధవ కృష్ణారెడ్డి, కమిషనర్‌ ప్రమీల ఉన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

మున్సిపల్‌ ఎన్నికల అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై స్పష్టత ఇస్తూ వివరించారు. నామినేషన్ల స్వీకరణలో చెక్‌లిస్ట్‌ను జాగ్రత్తగా పూర్తిచేసి, పత్రాల్లో లోపాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలన్నారు. విధులకు సంబంధించి సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని, అభ్యర్థులకు తప్పు డు సమాచారం లేదా తప్పు మార్గదర్శకత్వం ఇవ్వకూడదని హెచ్చరించారు. ఆర్‌ఓలు నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement