● స్థానిక ఎన్నికల్లో కలసికట్టుగా
విజయం సాధిద్దాం
● సమావేశాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి,
ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, మదనపల్లె: మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎంపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. సందర్భంగా మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసినట్టుగా పనిచేసి విజయం సాధించాలని కోరారు. పార్టీ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. ప్రతి అభ్యర్థి అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో పనిచేయాలని కోరారు. మదనపల్లె మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో బలంగా ఆదరణ ఉందని, విజయం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు కలిసికట్టుగా సమన్వ యం చేసుకుంటూ ముందుకు సాగాలని.. ఏ ఇబ్బంది ఎదురైనా పార్టీ అండగా ఉంటుందని.. చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
రెండు ఓట్లపై ప్రచారం
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి, వార్డు అభ్యర్థికి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుందన్న విషయాన్ని ప్రచారం నిర్వహించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పార్టీ నేతలకు సూచన చేశారు. గురువారం ఆయన ఎంపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, చర్యలను తెలియజేశారు. నామినేషన్ల నుంచి ఓటింగ్ ముగిసేదాకా ప్రతి అభ్యర్థి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు షమీం అస్లాం, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు జింకా వెంకటా చలపతి, మున్సిపల్ మాజీ చైర్మన్ మనూజ, పరిశీలకులు బావాజాన్, సాయి ప్రసాద్ రెడ్డి, శశాంక్ రెడ్డి పాల్గొన్నారు.
పార్టీలో చేరిక
మదనపల్లె మండలం బొమ్మనచెరువు పంచాయతీ టేకులపాలెంకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు దండు కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గణేష్, ఎస్.నవీన్, శంకర, శరత్, నవీన్ తదితరులు ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి మిథున్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వనించారు.


