స్పీడు పెంచిన వైఎస్సార్‌సీపీ | - | Sakshi
Sakshi News home page

స్పీడు పెంచిన వైఎస్సార్‌సీపీ

Oct 16 2026 7:47 AM | Updated on Oct 16 2026 7:47 AM

● మున్సిపల్‌ అభ్యర్థుల ప్రకటన

● మదనపల్లె చైర్మన్‌ అభ్యర్థిగా చలపతి,

రాయచోటి చైర్మన్‌ అభ్యర్థిగా

జిన్నా మహమ్మద్‌ షరీఫ్‌

సాక్షి, మదనపల్లె: వైఎస్సార్‌ సీపీ స్పీడు పెంచింది. అధికార పార్టీ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి జోరుమీదుంది. మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా జింకా వెంకటా చలపతిని పార్టీ అధిష్టానం గురువారం ప్రకటించింది. పార్టీలో సీనియర్‌ నాయకుడైన చలపతి సేవలను పార్టీ గుర్తించింది. ఈ మేరకు ఆయన నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జింకా చలపతి మదనపల్లి బీటీ కళాశాల విద్యార్థి సంఘం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఒకసారి సంఘ చైర్మన్‌గా పని చేశారు. మదనపల్లె మున్సిపాలిటీలో నాలుగు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికై, ఒకసారి వైస్‌ చైర్మన్‌ గా పని చేశారు. కార్మిక వర్గ నాయకుడిగా ఉంటూ లారీ వర్కర్స్‌ యూనియన్‌ కు అధ్యక్షుడిగా పని చేశారు. వైఎస్‌ఆర్సీపీలో ఇప్పటికీ పలు పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రజల సమస్యలపై అహర్నిశలు పోరాడడం, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పట్టణ ప్రజల్లో గుర్తింపు పొందారు.

రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఖరారు

రాయచోటి : రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడు జిన్నా మహమ్మద్‌ షరీఫ్‌ను పార్టీ ఎంపిక చేసింది. ఈ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించిన విషయం విదితమే. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా షరీఫ్‌ పేరును అందరి ఆమోదంతో ఎంపిక చేసినట్లు నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ తేదిని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన రాయచోటిలో మీడియాకు తెలిపారు.

జింకా వెంకటా చలపతి జిన్నా మహమ్మద్‌ షరీఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement