నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత వేటు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత వేటు

Oct 16 2026 7:47 AM | Updated on Oct 16 2026 7:47 AM

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఏ ఒక్కరూ అతిక్రమించినా అనర్హత వేటుతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం మదనపల్లి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన జిల్లాలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.. ప్రతి ర్యాలీ, సభ, సమావేశానికి 48 గంటల ముందే పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, ఒకే మార్గంలో వేర్వేరు పార్టీలకు ఒకే సమయంలో ర్యాలీలకు అనుమతి ఇవ్వబోమని తెలిపారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి సైలెంట్‌ జోన్లలో మైకుల ప్రచారం పూర్తిగా నిషేధమని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, కానుకలు పంపిణీ చేస్తే అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రూ.50 వేలకు మించి సరైన పత్రాలు లేని నగదును సీజ్‌ చేస్తామని, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు

పటిష్ట బందోబస్తు

జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. మదనపల్లె, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వివరాలను ప్రొజెక్టర్‌ ద్వారా నిశితంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది మోహరింపు, రూట్‌ మార్చిలపై అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నవారిని ముందస్తుగా గుర్తించి బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో, ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.వ రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్‌. కృష్ణమోహన్‌, వివిధ పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.

ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement