సాక్షి, మదనపల్లె: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు మొదలయ్యాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను జెడ్పీ సీఈవో లక్ష్మీపతి గురువారం పరిశీలించారు. జిల్లాలోని 25 జెడ్పీటీసీ, 25 ఎంపీపీ, 321 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 1,201 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఎన్నికల సామగ్రిని మండలాలకు తరలించి ఎంపీడీవోలకు అప్పగిస్తున్నామని వివరించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, సి బ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహించాలని ఆయన సిబ్బందిని సూచించారు.


