● ఈనెల 31వతేదీ వరకు
ఫీజు చెల్లింపుకునకు అవకాశం
మదనపల్లె సిటీ: పలు కారణాల వల్ల చదువుదూరమై... చదవాలనే ఆకాంక్ష ఉన్న వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం. అలాంటి వారు పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ ) ద్వారా ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. ఫీజు చెల్లించడానికి ఈనెల 31వతేదీ వరకు అవకాశం కల్పించారు. అభ్యాసకులకు విద్యను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం ఓపెన్ స్కూల్ తరగతులు నిర్వహిస్తోంది.
టెన్త్‌కు 35, ఇంటర్‌కు 31 కేంద్రాలు:
జిల్లాలో టెన్త్‌కు 35, ఇంటర్‌కు 31 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. పదో తరగతిలో 100 మందికి, ఇంటర్‌లో నాన్‌సైన్స్‌లో 40, సైన్స్‌లో 100 మందికి అవకాశం ఉంది. అడ్మిషన్ పొందిన వెంటనే స్టడీ మెటీరియల్ అందిస్తారు. ప్రతి అదివారం సెలవు దినాల్లో ఆయా అధ్యయన కేంద్రాల్లో కాంట్రాక్టు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతితో పాటు ఇంటర్‌లో ఆర్ట్స్ గ్రూపుౖలైన హెచ్‌ఈసీ, సీఈసీన, సైన్స్ గ్రూపులైన ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీలో ప్రవేశాలు పొందవచ్చు. ఈ సర్టిఫికెట్లు ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు, పదోన్నతులకు ఉపయోగపడుతున్నాయి. అభ్యర్థులు పదో తరగతి మార్కులు జాబితా లేదా జనన ధ్రువీకరణ పత్రం,టీసీ, ఆధార్‌కార్డు, కులధ్రువీకరణపత్రం,బ్యాంకు పాస్‌బుక్, ఫోటో, సంతకంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రవేశాలు ఇలా...
ఓపన్ స్కూల్‌కు అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. అపరాధ రుసుం లేకుండా ఈనెల 31వతేదీలోపు ఆన్‌లైన్ అడ్మిషన్ పొందవచ్చు. ఓపన్ స్కూల్‌లో పది, ఇంటర్ అడ్మిషన్ పొందిన వారికి ప్రతి ఆదివారం, నెలలో రెండో శనివారం అధ్యయన కేంద్రాల్లో 30 కాంట్రాక్టు తరగతులు నిర్వహిస్తారు. కనీసం 24 కాంట్రాక్టు తరగతులకు హాజరైన వారిని మాత్రమే అనుమతిస్తారు. సార్వత్రిక పాఠశాలలో చేరే వారికి స్టడీ మెటీరియల్ సరఫరా చేస్తారు.
ఐదేళ్లలో పూర్తి చేయాలి:
అభ్యాసకులు నిర్ణీత ఐదేళ్లలో తొమ్మిది సార్లు పరీక్ష రాసి ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్ పరీక్షలు రాసే వారు మాత్రం 10 పాసై రెండేళ్ల వ్యవధి ఉంటే ఐదు సబ్జెక్టులు ఒకేసారి రాసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల వ్యవధి లేకపోతే నాలుగు సబ్జెక్టులు రాసి,రెండేళ్లు పూర్తయిన తర్వాత మిగిలిన ఒక సబ్జెక్టును రాసుకోవచ్చు. అడ్మిషన్ పొందిన అనంతరం ఐదేళ్లనలో తొమ్మిది సార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందకపోతే తిరిగి కొత్తగా అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది.
’సర్టిఫికెట్‌కు గుర్తింపు ఉంది:
సార్వత్రిక పాఠశాలలో చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు అందించే సర్టిఫికెట్లు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఎంసెట్, డైట్‌సెట్ వంటి పరీక్షలతో పాటు ఇంటర్ అర్హతతో పొందే అన్ని ఉద్యోగాలకు అర్హులే.
అర్హతలు ఇవి: 14 సంవత్సరాలు నిండినవారు పదవ తరగతిలో, పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందవచ్చు.


