తండ్రిని కట్టెతో కొట్టి చంపిన కుమారుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

తండ్రిని కట్టెతో కొట్టి చంపిన కుమారుడి అరెస్టు

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

మదనపల్లె టౌన్‌: కన్నతండ్రిని కట్టెతో కొట్టి దారుణంగా హత్య చేసిన కుమారుడిని మదనపల్లె తాలూకా పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. తాలూకా సీఐ మహమ్మద్‌ రఫీ తెలిపిన వివరాల ప్రకారం... మదనపల్లె మండలం, కొత్తవారిపల్లె పంచాయతీ పులవాండ్లపల్లె గ్రామానికి చెందిన రైతు చక్కర సహదేవ (50) నిత్యం మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల 13న రాత్రి కూడా సహదేవ మద్యం మత్తులో ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. దీంతో విసిగిపోయిన కుమారుడు చక్కర సంతోష్‌ (24) తండ్రితో వాగ్వాదానికి దిగి, ఆవేశంలో కట్టెతో తలపై బలంగా బాదాడు. తల, నుదురు భాగాల్లో తీవ్ర రక్తగాయాలు కావడంతో సహదేవ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం నిందితుడు సంతోష్‌ను అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలున్న కట్టెను స్వాధీనం చేసుకున్నారు. మద్యం రక్కసి కారణంగా ఒక నిండు ప్రాణం పోయి, కుటుంబం రోడ్డున పడటంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement