కేవీపల్లె: మండల పరిధిలో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ నడుపుతుండగా ఒక్కసారిగా అది అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. నూతనకాల్వ పంచాయతీ పరిధిలోని వడ్డిపల్లె గ్రామానికి చెందిన పూజారి నిరంజన్ (35) గురువారం తన పని నిమిత్తం పీలేరు వైపు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి ట్రాక్టర్‌లో కేవీపల్లె వైపునకు బయలుదేరాడు. వగళ్ల పంచాయతీ నారమాకులమిట్ట సమీపంలోని ప్రమాదకరమైన డౌన్ రోడ్డు వద్దకు రాగానే ట్రాక్టర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయింది. క్షణాల వ్యవధిలోనే వాహనం అదుపుతప్పి పక్కకు బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్ కింద పడిపోయిన నిరంజన్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే కేవీపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.


