● అవమానం భరించలేక ఆత్మహత్యా యత్నం
మదనపల్లె టౌన్: మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు పోలీసులు కొట్టారని మిద్దె పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. మండలంలోని కోళ్ల బైలు వైఎస్సార్ కాలనీకి చెందిన రవి కుమారుడు నవదీప్, స్థానిక నక్కల దిన్నె తండాకు చెందిన మాధవిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. టూ టౌన్ ఎస్‌ఐ, సీఐ ఇద్దరూ మేజర్లు కావడంతో కలిసి ఉండవచ్చని చెప్పడంతో భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. అయితే కానిస్టేబుల్ రవి నాయక్ జోక్యం చేసుకోని తమ బిడ్డపై దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నవదీప్ మిద్దైపె నుంచి దూకాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. తల్లిదండ్రులు యువకుడిని స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. వన్ టౌన్ పరిధిలో కేసు ఉండగా టూ టౌన్ లో కొట్టారని తండ్రి రవి ఆరోపించారు. ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.


