● ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగాలి
● ఎంపీ మిథున్‌రెడ్డి
పుంగనూరు : రెండన్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి ఇంటికెళ్లి ప్రజలకు వివరించాలని.. రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఉద్భోధించారు. బుధవారం సాయంత్రం ఆయన పట్టణంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్ అభ్యర్థులతో విడివిడిగా 36 వార్డుల వారీతో సమీక్ష నిర్వహించారు. నామినేషన్లు, ఉపసంహరణ, పరిశీలనతో పాటు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. వార్డు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను వైఎస్సార్‌సీపీ లీగల్‌టీమ్ ద్వారా పరిశీలన చేసి, దాఖలు చేసుకోవాలన్నారు. లీగల్‌టీమ్ న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాలను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో నిర్వహించాలని సూచించారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు స్థానిక సంస్థల నుంచి పునాదులను వేసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్దీన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, బలిజ సంఘ నాయకులు పూలత్యాగరాజు, కిషోర్, రాజేష్, గోవర్ధన, సాగర్, గోపి తదితరులు పాల్గొన్నారు.


