సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా
మదనపల్లెటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల పోలీసు అధికారులతో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పాత నేరస్తులు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు ప్రధాన రహదారులు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా భద్రత , పటిష్ట బందోబస్తు కల్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోసమీక్షలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


