మదనపల్లె టౌన్: మదనపల్లె–తిరుపతి బైపాస్ రోడ్డులో సీటీఎం చెరువు వద్ద బుధవారం తెల్లవారుజామున బియ్యం లోడ్‌తో వెళ్తున్న టెంపో బోల్తా పడింది. టెంపో రోడ్డుపై పల్టీ కొట్టి అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు, వాహనదారులు స్పందించి గాయపడిన డ్రైవర్ మోహన్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై బియ్యం బస్తాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. క్రేన్ సహాయంతో టెంపోను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


