రీ సర్వేలో ‘డి–కేట్‌’రాయుళ్ల హవా! | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేలో ‘డి–కేట్‌’రాయుళ్ల హవా!

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

పెద్దమండ్యం: దరఖాస్తు పట్టా (డీకేటీ) భూముల క్రయవిక్రయాలు చట్టవిరుద్ధమన్నా పెద్దమండ్యం మండలంలో ఆ నిబంధనలు నడవవు. ఇక్కడ ‘డి–కేట్‌’రాయుళ్లు పేదల భూములకు ఎంతోకొంత ఆశ చూపి విక్రయ అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యుల పేరిట నకిలీ పట్టాలు సృష్టించి రికార్డులను ఆన్‌లైన్‌ కానిచ్చేస్తున్నారు. పెద్దమండ్యం, సీగొల్లపల్లె, పాపేపల్లె, బండ్రేవు, కలిచెర్ల గ్రామాలలో ఈ దందా జోరుగా సాగుతోంది. ఒక్కో అక్రమార్కుడి కుటుంబంలో ఏకంగా 12 ఎకరాల వరకు డీకేటీ పట్టాలు సృష్టించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వేలో వీరు ధన, రాజకీయ బలంతో రికార్డులను మార్చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిజమైన పేద రైతులకు సాగుభూమి, పాసు పుస్తకాలు ఉన్నా ఆన్‌లైన్‌లో రికార్డులు ఎక్కక ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నారు.

2009 నాటి నకిలీల భాగోతం

గతంలో అప్పటి సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో నకిలీ డీకేటీ పట్టాలతో రుణాలు పొందినట్లు ఫిర్యాదులు రావడంతో మదనపల్లె ఆర్‌డీఓ శివారెడ్డి నేతృత్వంలో దాడులు జరిగాయి. పెద్దమండ్యం, బండ్రేవు గ్రామాల్లోని ఇళ్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి భారీగా నకిలీ రికార్డులు, ఖాళీ పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో కేసుల భయంతో కొందరు తమ వద్ద ఉన్న నకిలీ పుస్తకాలను తగులబెట్టారు. ఆ చరిత్ర ఉన్నా ఇక్కడ తీరు మారలేదు.

ఒకే భూమి.. ఇద్దరు పట్టాదారులు!

సర్వే నెంబరు 317 లో నలుగురు అన్నదమ్ములు 2 ఎకరాల వారసత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమికి మరో ఇద్దరి పేరిట పట్టాలు ఉన్నట్లు గొడపలు పడ్డారు. ఈ వివాదం రెవెన్యూ అధికారుల వద్దకు చేరింది. ఇదే గ్యాప్‌లో ఆ సర్వే నంబరు గుండా వెళ్తున్న హంద్రీ–నీవా కాలువ నష్టపరిహారాన్ని అక్రమార్కులు నొక్కేసినట్లు సమాచారం.సర్వే నెంబరు 247/7 లోని 3 ఎకరాల మేత, కుంట పోరంబోకు భూమికి గతంలో ఇచ్చిన డీకేటీ పట్టాను రైతుల ఫిర్యాదుతో అప్పటి ఆర్‌డీఓ వెంకటరెడ్డి రద్దు చేశారు. కానీ అదే రద్దయిన భూమిని గ్రామానికి చెందిన పలుకుబడి కలిగిన ఓవ్యక్తి కొనుగోలు చేసి, నకిలీ పట్టాతో ఆన్‌లైన్‌ చేయించుకోవడం గమనార్హం.

పెద్దమండ్యంలో చట్టం

అక్రమార్కులకు చుట్టం..

పేదవాడి భూమికి ఎర, ఆన్‌లైన్‌ జాతర!

అధికార, ధన బలంతో రికార్డుల తారుమారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement