మదనపల్లె టౌన్: అన్నమయ్య, కడప జిల్లాల్లో వరుసగా 9 చోరీలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలను మదనపల్లె సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కురబలకోట మండలం ఎరుకులపల్లికి చెందిన ఇరగ అశోక్, రాయచోటి మండలం గుట్ట కింద హరిజనవాడకు చెందిన గువ్వ ఆనంద్ బాబులు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పలు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 185 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి ఆభరణాలు, చోరీలకు ఉపయోగించిన ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటాద్రి పర్యవేక్షణలో ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన సీసీఎస్ సీఐ కె. రాజారెడ్డి, ఎస్ఐలు నరసింహుడు, రమేష్, హరిహర ప్రసాద్, రహిముల్లాను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్ కూ డా పాల్గొన్నారు.ౖ ప్రజలు ఊళ్లకు వెళ్లేటప్పుడు విలువైన బంగారు, వెండి వస్తువులను ఇళ్లలో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని ఎస్పీ సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్య క్తులు కనిపిస్తే వెంటనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్లు 100 లేదా 112 కు సమాచారం అందించాలని తెలిపారు.
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
185 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, బైక్ స్వాధీనం


