మదనపల్లె టౌన్: స్కూటర్ ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లెలో చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు.. నీరుగట్టుపల్లికి చెందిన చేనేత కార్మికుడు జి. రెడ్డప్ప (38) టమాటా మార్కెట్ యార్డు వద్ద నిలుచుని ఉండగా, మద్యం మత్తులో ఉన్న యువకులు స్కూటర్‌ను వేగంగా నడిపి రెడ్డప్పను ఢీకొట్టి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు..
కలకడ: ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యపు పోటీ వల్ల ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కలకడ మండలం ఇర్రివాండ్లపల్లె వద్ద జరిగింది. గ్రామానికి చెందిన వీరభద్ర, సంగటి మహేశ్వర (16)లు సైకిల్‌పై వస్తుండగా, చంద్ర, సిద్దయ్య అనే ఇద్దరు డ్రైవర్లు తమ ఆటోలతో పోటీ పడుతూ అతివేగంగా వచ్చి వారిని ఢీకొట్టారు. ప్రమాదాన్ని చూసిన గొర్రెల కాపరి చిన్నమల్లయ్య క్షతగాత్రులను గ్రామానికి చేర్చారు. తీవ్ర రక్తగాయాలైన ఆ విద్యార్థులను వారి తండ్రులు కలికిరి మండలం మహల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మార్కెట్ యార్డులో గొడవ
పులివెందుల రూరల్: లోడు దింపే విషయంలో ముగ్గురి మధ్య జరిగిన గొడవ దాడికి దారితీసింది. పట్టణంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయ సమీప మార్కెట్ యార్డులో గణేష్, సుధాకర్, మహీధర్‌ల మధ్య ఈనెల 12న తెల్లవారుజామున వివాదం జరిగింది. మాట మాట పెరగడంతో సుధాకర్, మహీధర్‌లు మరికొందరితో కలిసి గణేష్‌ను కొట్టారు. గాయపడిన గణేష్ బుధవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


