అక్రమంగా చెట్ల నరికివేత: కోర్టులో ప్రైవేట్‌ కేసు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా చెట్ల నరికివేత: కోర్టులో ప్రైవేట్‌ కేసు

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

రాయచోటి టౌన్‌: తమ పొలంలో వందేళ్ల నాటి చెట్లను దౌర్జన్యంగా నరికివేశారంటూ నలుగురు బాధితులు రాయచోటి కోర్టులో ప్రైవేట్‌ కేసు వేశారు. బాధితుల న్యాయవాది టి. ఈశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. టి.సుండుపల్లె మండలం పొలిమేరపల్లెకు చెందిన చింతల లక్ష్మికాంతమ్మ, వెంకటరమణ, నాగరత్నమ్మ, అయ్యప్పరెడ్డిలకు సర్వే నంబర్‌ 553లో పొలం ఉంది. అందులోని సుమారు 50 చింత, వేప చెట్లను అదే గ్రామానికి చెందిన పద్మరాజు వెంకటరాజు, సోమల రాజ నారాయణ రాజు ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా నరికేశారు. దీనిపై స్థానిక పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే తాము కోర్టును ఆశ్రయించామని బాధితులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement