ఓటు కోసం కోటి విద్యలు! | - | Sakshi
Sakshi News home page

ఓటు కోసం కోటి విద్యలు!

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

సాక్షి, మదనపల్లె : కూటమి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా రెండున్నరేళ్లయింది. ఇన్నాళ్లకు స్థానిక సంస్థల్లో అభివృద్ధి గుర్తొచ్చింది. అది కూడా స్థానిక ఎన్నికల హడావుడి మొదలయ్యాక. ఆ మధ్య మున్సిపాలిటీలకు నిధుల పేరిట చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేసింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలంటూ సంబరాలు చేసుకుంది. తాజాగా పల్లె సీమల్లో మౌలిక వసతుల కోసమంటూ అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమైంది.

ఓట్ల కోసం బాబు మాయాజాలం

జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పేరిట కేవలం రూ.94 కోట్ల పనులకు హడావుడి చేశారు. గతనెల 22న సీఎం చంద్రబాబు వర్చువల్‌గా మదనపల్లెలో రూ.35 కోట్లు, రాయచోటిలో రూ.35 కోట్లు, పుంగనూరులో రూ.20 కోట్లు, బి.కొత్తకోట నగర పంచాయతీలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. దీనికోసం పెద్ద హడావుడినే జరిగింది. ఎన్నికలకు ముందు వరకు మున్సిపాలిటీలో అభివృద్ధి గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అందులో ముఖ్యంగా వైఎస్‌ఆర్సీపీ పాలకవర్గాలు ఉండడంతో పట్టణాల ఊసే ఎత్తలేదు. తీరా పాలకవర్గ పదవి కాలం ముగిసి, ఎన్నికలకు సిద్ధమైన వేళ ప్రభుత్వం ఓట్ల కోసం అభివృద్ధి జిమ్మిక్కును ప్రదర్శించింది. 28 నెలల కాలంలో మున్సిపాలిటీల గురించి పట్టించుకోని ప్రభుత్వం నేరుగా ఎన్నికలకు వెళ్లి ఓట్లు అడిగితే ప్రజలు ప్రశ్నిస్తాన్న ఆందోళనతో కొద్దిపాటి నిధులతో పనులు చేపట్టింది. ఎన్నికలొచ్చేంతవరకు ప్రజా సంక్షేమం.. అభివృద్ధి పాలకులకు పట్టదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవే ఎన్నికలు రాకుండా ఉంటే పట్టణాలను ప్రభుత్వం పట్టించుకునేదా అని తూర్పారబడుతున్నారు. మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కొరత, మెరుగైన పారిశుద్ద్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె, రాయచోటి మున్సిపాలిటీల్లో ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. తాగునీటి సమస్యను పట్టించుకోని ప్రభుత్వం అభివృద్ధి పేరిట కోట్ల కోసం ప్రచారం చేపట్టింది. ఈ నిధులు ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

‘కోటి’ ఎవరికని ఇస్తారు!

గ్రామపంచాయతీ, మండల పరిషత్‌ ఎన్నికలు కూడా ముందుకు రావడంతో ప్రభుత్వం మళ్లీ అభివృద్ధి నాటకం మొదలుపెట్టింది. ఇన్నాళ్లు స్థానిక సంస్థలకు కనీస సహకారం అందించని ప్రభుత్వం ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.ఒక కోటి నిధులు అంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఒక కోటితో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 100కుపైగా ఉండే గ్రామపంచాయతీల్లో మౌలిక వసతులకు, అభివృద్ధికి వినియోగించాలని సూచించింది. కోటి రూపాయలు ఒక అసెంబ్లీకి ఏ మూలకు సరిపోతాయో ప్రభుత్వానికే తెలియాలి. పంచాయతీకి లక్ష రూపాయలు కూడా దక్కదు. ఈ సొమ్ముతో ఒక పంచాయతీలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించవచ్చునో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ నిధులు ఇచ్చామని చెప్పుకొని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇలా అభివద్ధి ఎత్తుగడ వేస్తోంది. కాగా మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ఎప్పటికీ పూర్తి చేస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్నికల కోసం ఇస్తున్న కోటి నిధుల పనులు ఎన్నికలు ముగిసేలోగా పూర్తి చేయగలరా అనేది అనుమానమే. ఓటు కోసం బాబు కోటి విద్యలు పడుతుంటే.. ఓటుతో వాత పెట్టేందుకు జనాలు సిద్ధమవుతున్నారు.

ఓటునునోటుతో కొంటా!..

నా రూటే సపరేటు

ఎన్నికల వేళ చంద్రబాబు అభివృద్ధి నాటకం!

కోటి రూపాయలతోపల్లెల్లో మౌలిక వసతులట!

ఆ మధ్య మున్సిపాలిటీలకు

రూ.94 కోట్లంటూ హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement