ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

మదనపల్లె టౌన్‌ : పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించడమే తమ ముందున్న లక్ష్యమని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి అన్నారు. మంగళవారం పుంగనూరులో విస్తృతంగా పర్యటించారు. ఎన్‌.ఎస్‌.పేట బసవరాజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు ఈస్ట్‌ పేట, భగత్‌ సింగ్‌ కాలనీ, మేలుపట్ల, అలాగే మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక, సున్నిత పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ బి.ప్రసాద్‌, ఇన్స్పెక్టర్‌ బి.సుబ్బరాయుడు, ఎస్‌ఐ అన్సర్‌ బాషా పాల్గొన్నారు.

ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement