సాక్షి, మదనపల్లె : వర్షాభావ పరిస్థితులతో రైతులు వైవిధ్యమైన పంటలతో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన పంటల సాగుపై ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సజ్జ, కొర్ర, నువ్వులు, ఆవాలు, ఉలవలు, అలసందలు, అనుములు, గోరుచిక్కుడు, కుసుమలు వంటి పంటలతో పాటు అనుకూల పరిస్థితుల్లో ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు పెంచుకోవాలని రైతులకు సూచించారు. జీవవైవిధ్య పంటలను విత్తుకోవాలని కార్యాచరణ ప్రణాళిక అమ లు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హరిప్రియ, ఏపీసీఎన్‌ఎఫ్ డీపీఎం వెంకట మోహన్, ఏడీఏ నవీన్ కుమార్ పాల్గొన్నారు.


