కరెంట్‌ షాక్‌తో అన్నదమ్ములకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ షాక్‌తో అన్నదమ్ములకు తీవ్ర గాయాలు

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

మదనపల్లె టౌన్‌ : బోరు మోటార్‌ అమర్చడానికి వెళ్లిన అన్నదమ్ములకు కరెంట్‌ షాక్‌ కొట్టి తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం బి.కొత్తకోట మండలంలో జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. ములకలచెరువు మండలంలోని బావగారిపల్లెకు చెందిన వెంకట్రాయప్ప(45), నరసింహులు(50), ఇద్దరు అన్నదమ్ములు కలసి బోర్‌ మెకానిక్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బి కొత్తకోట మండలం గుమ్మసముద్రంలోని రైతు బాలకృష్ణారెడ్డి వ్యవసాయ బోరును బయటకు తీసి మారమ్మతు చేయడానికి తన వద్ద ఉన్న మోటార్లు వెలికి తీసే క్రేన్‌ తీసుకుని ఇద్దరు అన్నదమ్ములు గుమ్మసముద్రానికి వెళ్లారు. అక్కడ క్రేన్‌ సాయంతో మోటార్‌ను పైకి లాగుతుండగా పైనే ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైర్లు క్రేన్‌కు టచ్‌ కావడంతో కరెంటు షాక్‌ కొట్టి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే స్థానికులు చికిత్సల నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వెంకట్రాయప్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి వెళ్లాలని రెఫర్‌ చేశారు. కాగా నరసింహులు స్థానికంగానే చికిత్సలు పొందుతున్నాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట పోలీసులు తెలిపారు.

పెద్దదర్గాలో సినీ నటుడు శ్రీవిష్ణు ప్రార్థనలు

కడప సిటీ : ప్రముఖ సినీ నటుడు, క్రామేడ్‌ కల్యాణ్‌ ఫేమ్‌ శ్రీవిష్ణు మంగళవారం రాత్రి కడప పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తన కడప పర్యటనలో భాగంగా ఆయన దర్గాకు చేరుకోగా, దర్గా నిర్వాహకులు సాదర స్వాగతం పలికి దర్గా సంప్రదాయమైన తలపాగా చుట్టి దర్గా గురువుల దర్శనం చేయించారు. తొలుత ఆయన దర్గాలోని హజరత్‌ పీరుల్లామాలిక్‌ మజార్‌ను దర్శించుకోగా, అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో సందడి

ప్రొద్దుటూరు క్రైం : ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు అన్నారు. ప్రొద్దుటూరులోని అమీర్‌ సినిమా థియేటర్‌లో హీరో శ్రీవిష్ణుతోపాటు చిత్ర యూనిట్‌ సందర్శించింది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ, అభిమానమే చిత్ర విజయానికి ప్రధాన కారణమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం హీరో విష్ణు కేక్‌ కట్‌ చేసి అభిమానులతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్‌ థియేటర్‌ యాజమాన్య ప్రతినిధులు అమీర్‌ బాషా, ఫైరోజ్‌, జాకీర్‌, గౌస్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement