విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న లారీ

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

● తప్పిన పెనుప్రమాదం

కలకడ : నిద్రమత్తులో లారీ నడిపి 11కేవీ విద్యుత్‌ లైన్‌ ఇనుప స్తంబాన్ని ఢీకొన్న ప్రమాదం సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన టిప్పర్‌ లారీ పీలేరు వైపు నుంచి రాయచోటి వైపుగా వస్తుండగా.. డ్రైవర్‌ మురగన్‌ నిద్రలోకి జారుకున్నాడు. అదృష్టవశాత్తు ముందు–వెనుక ఎలాంటి వాహనాలు రాకపోవడంతో.. ఎడమ వైపు నుంచి కుడి వైపునకు వచ్చి 11 కేవీ విద్యుత్‌ సరఫరా స్తంభాన్ని ఢీకొన్నా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ ఢీకొన్న ప్రమదానికి నాలుగు స్తంభాల విద్యుత్‌ సరఫరా ఉన్న పోల్‌ విరిగి లారీ మీదకు ఒరిగిపోయింది. అయినా విద్యుత్‌ తీగలు లారీకి తగలక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీని వెనక్కు తీసినా విద్యుత్‌ తీగలు తగిలే ప్రమాదం ఉండటంతో.. లారీని ప్రమాద స్థలంలోనే ఉంచి డ్రైవర్‌ను ప్రమాదం నుంచి కాపాడారు.

విద్యుత్‌ సేవల పునరుద్ధరణ

అర్ధరాత్రి సమయంలో జరిగిన ప్రమాదాన్ని వెంటనే పరిశీలించిన కలకడ విద్యుత్‌ శాఖ సిబ్బంది తెల్లవారుజామున 3–30 గంటలకు 11కేవీ విద్యుత్‌ లైన్‌ను పునరుద్ధరించి సరఫరా అందజేసి శభాష్‌ అనిపించుకున్నారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కలకడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన జరిగిన ఈ ప్రమాదంతో.. కలకడ నుంచి బాటవారిపల్లె వరకూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, విద్యుత్‌ వినియోగదారులందరికీ గ్రూప్‌ ద్వార్వా సమాచారం అందించి, ప్రమాదం గురించి తెలియజేశారు. మంగళవారం ప్రమాదం జరిగిన స్తంభాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement