● ప్రొద్దుటూరులో వైభవంగా
శరన్నవరాత్రి ఉత్సవాలు
● మైసూరును తలపించిన
ఆధ్యాత్మిక శోభ
● కనులపండువగా కలశాల ఊరేగింపు,
సాంస్కృతిక ప్రదర్శనలు
● కాలుపెడితే కదలలేని స్థితి..
● రైలు బోగీల్లో ప్రయాణికులకు ఇక్కట్లు
మంగళవాయిద్యాల మోతలు, వేదమంత్రాల ఘోషలు, సువాసినుల గోవిందనామాల నడుమ రెండో మైసూరుగా ప్రసిద్ధి చెందిన పుత్తడిపురం ఆధ్యాత్మిక సాగరమైంది. జగన్మాతను కొలిచే పవిత్ర శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం భక్తిప్రపత్తుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. లోకపావని అయిన ఆ పరాశక్తిని వేడుకుంటూ భక్తులు ఆలపించిన ‘పాహిమాం పరమేశ్వరి’ నామస్మరణతో పురవీధులు పులకించిపోయాయి. దేవీ నవరాత్రుల కలశస్థాపన పూజలతో పట్టణమంతటా భక్తిభావం ఉప్పొంగింది.
ప్రొద్దుటూరు కల్చరల్ : పుత్తడిపురం ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాల దసరా ఉత్సవ కమిటీల వారు దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య సువాసినులు అగస్త్యేశ్వర స్వామి ఆలయం నుంచి కలశాలలో నింపిన నవగంగ తీర్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చి వాసవీమాతకు అభిషేకం చేశారు. కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం నుంచి మంగళవాయిద్యాలతో, బాణసంచా పేలుళ్లతో ఊరేగింపుగా బయల్దేరి తెల్లాకుల శివయ్యగారి నగరేశ్వరస్వామి దేవస్థానం నుంచి చినవీరయ్య శెట్టి రచించిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి పురాణాన్ని తీసుకురావడంతో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో కర్ణాటక కళాకారుల చిలిపిలి బొమ్మలు, మహిళల కోలాటం, నృత్యప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు, పాలకొల్లు బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్ రావు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు సభ్యులు సభ్యులు పాల్గొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా బందోబస్తు నిర్వహించారు.
నృత్యం చేస్తున్న కళాకారులు
మదనపల్లె టౌన్: జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఆదివారం అన్ని స్థాయిల పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను ముందుగానే గుర్తించి అదనపు బలగాలను మోహరించాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పాత నేరస్థులు, గొడవలు సృష్టించే వ్యక్తులను బైండోవర్ చేయడంతో పాటు, ముమ్మరంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. అక్రమ మద్యం, నగదు, ఉచిత బహుమతుల రవాణాను అరికట్టేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు గ్రామాల్లో పర్యటనలు, పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు
శ్రీ లలితాదేవి, రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి సుహాసినులు గోవిందనామాలు, విష్ణుసహస్రనామ పారాయణం చేస్తూ అగస్త్యేశ్వరాలయానికి చేరుకుని గంగాజలంతో నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి పూజాకార్యక్రమాలను నిర్వహించారు.
శ్రీ మహాలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి ఆలయ ఉత్సవ కమిటీ వారు ఊరేగింపుగా పాత బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు చేసి కలశాన్ని తీసుకెళ్లారు.
స్థానిక శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ వారు కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రాజీవ్‌సర్కిల్‌లోని శివాలయంలో పూజలు చేశారు. శాసీ్త్రనగర్‌లోని రాజరాజేశ్వరిదేవి ఆలయం, సత్యనారాయణస్వామి ఆలయం, చౌడేశ్వరీదేవి ఆలయాల నిర్వాహకులు కలశపూజ వైభవంగా నిర్వహించారు.
శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, రమాదేవి దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యౖవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావు రాచమల్లు దంపతులకు అమ్మవారి చిత్రపటం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


