పీలేరు రూరల్ : ఆగివున్న క్రేన్‌ను బొలెరో పికప్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. పుంగనూరుకు చెందిన షేక్ హబీబ్(40) బొలెరో పికప్ వాహనంలో చింతామణి నుంచి మొక్కజొన్న లోడుతో గుంటూరుకు బయలుదేరాడు. అయితే నాలుగులేన్ల రహదారిలో ఆగివున్న క్రేన్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో హబీబ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్ ఢీకొని మహిళకు గాయాలు
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): ట్రాక్టర్ ఢీకొని మహిళ గాయపడ్డ సంఘటన ఆదివారం నిమ్మనపల్లి మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని గారబురుజుకు చెందిన రవీంద్రారెడ్డి భార్య సరళమ్మ(50) ఇంటి ముందు నిలుచొ ని ఉండగా, అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్‌ను నడుపుతూ సరళమ్మను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు కాలు విరిగి తీవ్రంగా గాయపడడంతో కుటుంబీకులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన చికిత్సల అనంతరం, రుయాకు రెఫర్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నిమ్మనపల్లి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.


