రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో ఆదివారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలపవారికోట గ్రామానికి చెందిన సాంబశివ తన బైక్‌పై తంబళ్లపల్లె వైపు వెళ్తున్నారు. అదే సమయంలో గోపిదిన్నె కొత్తపల్లెకు చెందిన నవీన్‌ కుమార్‌(19) తన పొలం వద్దకు బైక్‌పై వెళ్తున్నారు. కొత్తపల్లె సమీపంలోని పాత రైస్‌ మిల్లు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇరువురి బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, బాధితులను తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement