గుర్తుతెలియని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మహిళ మృతి

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

కలికిరి : కలికిరి రైల్వేస్టేషన్‌ పరిధిలోని రెండవ ప్లాట్‌ఫామ్‌పై గుర్తుతెలియని మహిళ ఆదివారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై సుమారు 45 ఏళ్ల వయసు ఉన్న మహిళ అచేతన స్థితిలో ఉండేది. అటుగా వెళ్లే వారు ఇచ్చే ఆహారం తింటూ ఉండేది. ఆదివారం ఉదయం ఆమె కదలకుండా ఉండటంతో అటుగా వాకింగ్‌ వచ్చిన వ్యక్తులు గమనించి, రైల్వే స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

హార్సిలీహిల్స్‌ పైప్‌లైన్‌ మళ్లీ ధ్వంసం

సాక్షి, మదనపల్లె : పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ పైకి తాగునీటిని సరఫరా చేసే పైప్‌ లైన్‌ ను ఆకతాయిలు ధ్వంసం చేశారు. కురబలకోట మండలం తెట్టు నుంచి పైప్‌ లైన్‌ ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఘాట్‌ రోడ్‌ లోని మలుపు వద్ద పైప్‌ లైన్‌ వెళ్తుంది. పర్యాటకులు ఇక్కడ సేద తీరుతుంటారు. రెండు రోజుల క్రితం పెద్ద బండరాయితో ఇనుప పైపులైన్‌ పై మోది ధ్వంసం చేశారు. దాంతో లీకేజీతో నీరు వృథా అవుతోంది. రెండు రోజులుగా నీటి సరఫరా సమయంలో నీరు వధా అయ్యింది. ఆదివారం పర్యాటక సిబ్బంది మరమ్మతు చర్యలు చేపట్టారు. రెండు నెలలు క్రితం ఇదే చోట ఇదే పైపును ధ్వంసం చేశారు. అప్పట్లో మరుమత్తులు చేసి నీటి సరఫరా కొనసాగించారు. ఇప్పుడు మళ్లీ అదే చోట ధ్వంసం చేశారు.

మిట్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు

కురబలకోట : యూఐ గ్రీన్‌ మెట్రిక్‌ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌–26లో అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు యూనివర్సిటీ ఫౌండర్‌, చాన్స్‌లర్‌ డాక్టర్‌ నాదేళ్ల విజయబాస్కర్‌ చౌదరి తెలిపారు. జాతీయ స్థాయిలో 29వ స్థానం సాధించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 2016 విద్యా సంస్థల్లో 704వ స్థానం,ఆసియాలో 419వ స్థానం సాధించినట్లు తెలిపారు. 110 దేశాలకు చెందిన విద్యా సంస్థలు పాల్గొన్న ఈఅంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మిట్స్‌ సాధించిన ఘనత గర్వకారణమన్నారు. పర్యావరణ పరిరక్షణ, సౌరశక్తి వినియోగం,నీటి సంర క్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి హరిత కార్యక్రమాలకు ఈగుర్తింపు నిదర్శనమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement