ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ పోటీలు

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

ప్రొద్దుటూరు కల్చరల్‌ : స్థానిక అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో ఆదివారం బాషా అథ్లెటిక్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్‌–14 బాలబాలికలకు మూడు రకాల ట్రయాథ్లాన్‌ పోటీలు నిర్వహించారు. ఏ గ్రూప్‌లో 60 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, బీ గ్రూప్‌లో 60 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌, సీ గ్రూప్‌లో 60 మీటర్లు, 600 మీటర్లు పరుగు, లాంగ్‌జంప్‌, అండర్‌–16 బాలబాలికలకు 60 మీటర్లు, 600 మీటర్లు పరుగు, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌త్రో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 13 మంది క్రీడాకారులు గురుమా బాష, మహమ్మద్‌ సుఫియాన్‌, సాయి కృష్ణ, జయసింహ, గంగాధర్‌, మహమ్మద్‌ అయాన్‌, నాగరాజు, భవిత, దీపికా రెడ్డి, రిషిత, లోహిత, హబీబా, ప్రశాంతి నవంబర్‌ 14, 15, 16 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని ఫౌండేషన్‌ కార్యదర్శి అహ్మర్‌ బాషా తెలిపారు. ఈ పోటీలను వ్యాయామ సంచాలకులు నాగూర్‌ బాషా, సుబ్బయ్య, ప్రణవి, తిరుమల, చందు, సతీష్‌రెడ్డి, నారాయణ, నాగేశ్వరరావు, ఖాదర్‌రెడ్డి, సుధాకర్‌, దిలీప్‌, రఫి తదితరులు పర్యవేక్షించారు.

లేపాక్షి ఎంపోరియంలో డిస్కౌంట్‌ అమ్మకాలు

కడప సిటీ : కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్‌లో గల లేపాక్షి హ్యాండీ క్రాఫ్ట్‌స్‌ ఎంపోరియంలో ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించినట్లు ఎంపోరియం మేనేజర్‌ మున్వర్‌ హుసేన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హస్త కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ విక్రయాలు సాగిస్తున్నామన్నారు. ముఖ్యంగా బొమ్మల కొలువును తీర్చిదిద్దే సంప్రదాయ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, మన సంస్కృతిని చాటే కళా ఉత్పత్తులలో ఎంపిక చేసిన వాటిపై 10–40 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారి, ఎంబ్రాయిడీ వస్తువులు, హ్యాండ్లూమ్‌ ఉత్పత్తులు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని, వీటిని కొనుగోలు చేసి హస్త కళాకారులకు అండగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement