కలకడ : అన్నమయ్య జల్లా కలకడ మండలం ఆవులప్పగారిపల్లెలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కొందరు కర్రలతో దాడికి తెగబడ్డారు.వైఎస్సార్ సీపీ కార్యకర్తతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బోరుబావి వద్దకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటమల్లప్పనాయుడును అడ్డుకుని చిన్నమనాయుడు, శ్రీనివాసులునాయుడు, రమేష్‌నాయుడు సహా ఆరుగురు బైక్‌పై నుంచి తోసి కొట్టారు. ఆయనను రక్షించేందుకు వచ్చిన రెడ్డిశేఖర్‌నాయుడు, రేవతి, రెడ్డెమ్మలపై నిందితులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో రెడ్డెమ్మ చేయి విరగ్గా, మిగిలిన ముగ్గురికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రులను వాల్మీకిపురం, మదనపల్లె ఆసుపత్రులకు తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
నలుగురికి గాయాలు


