అభ్యర్థుల ధ్రువపత్రాల సమస్య పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ధ్రువపత్రాల సమస్య పరిష్కరించండి

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

– కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

అమరనాథరెడ్డి లేఖ

సాక్షి, మదనపల్లె: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, దీన్ని పరిష్కరించాలని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు స్థానిక వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ శుక్రవారం కలెక్టరేట్‌ ఏఓకు లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో పేర్కొన్న అంశాలను వివరించారు. తక్షణమే చర్యలు తీసుకునేలా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సి ఉందని కోరారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపైనే ఉందని అన్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు తమకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల సమయంలో సమర్పించాల్సి ఉన్నందున దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అమరనాఽథ రెడ్డి లేఖలో కోరినట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement