నాటకం ముగిసింది | - | Sakshi
Sakshi News home page

నాటకం ముగిసింది

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

నాటకం ముగిసింది బీసీలు ఓట్ల కోసమేనా చంద్రబాబుకు మామూలే

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అనే నాటకాన్ని చంద్రబాబు చక్కగా ముగించారు. న్యాయస్థానంలో జీవోలు నిలబడవని తెలుసు. అసెంబ్లీలో చంద్రబాబు బీసీలను ఉద్ధరిస్తున్నట్టుగా రిజర్వేషన్ల గురించి గొప్పలు చెప్పుకున్నారు. అలాంటప్పుడు అవి అమలయ్యేలా చట్టబద్ధంగా ఎందుకు చర్యలు చేపట్టలేదు. జీవోల వల్ల ఉపయోగం లేదని తెలిసినా, జీవోలు జారీ చేయడం బీసీలను నిలువునా మోసం చేయడం కాదా. ఈ నాటకమంతా ఆడింది స్థానిక ఎన్ని కల్లో లబ్ధి కోసం కాదా.!

– జన్నే శేషా చలపతి, ఏపీ బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు

బీసీ యువతకు ఉద్యోగాలు, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వని చంద్రబాబు ఓట్ల కోసం రిజర్వేషన్‌ డ్రామా ఆడటం దారుణం. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, ప్రభుత్వ పదవుల్లో అవకాశాలు దక్కడం లేదు. బీసీల సంక్షేమం మాటలకే పరిమితమైంది. యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతున్నారు. వారిని గౌరవప్రదమైన రాజకీయ హోదాలో నిలబెట్టాలి. బీసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. – రామగౌడ్‌,

బీసీ సంక్షేమ సంఘం పొలిట్‌బ్యూరో సభ్యులు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడటం మామూలే. న్యాయస్థానంలో జీవోలు నిలవవని తెలిసి బీసీలను నమ్మించి మోసం చేశారు. ఎన్నికల్లో, అధికారంలో బీసీలు చంద్రబాబు చేతిలో మోసపోతున్నారు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకునేలా చట్టం చేయాలి. లేదంటే ప్రతిసారి చంద్రబాబు మాటలకు బీసీలు మోసపోవడం ఖాయం. – యూ.సాంబశివ,

బీసీ నాయకుడు, తంబళ్లపల్లి నియోజకవర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement