దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : దసరా సందర్భంగా ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు కడప జోన్‌ వ్యాప్తంగా 1233 బస్సులను నడపను న్నామని కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, కర్నూల్‌, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి బస్సులను నడుపుతున్నామని వివరించారు. వీటిలో బెంగుళూరుకు 340, హైదరాబాద్‌కు 157, చైన్నెకు 71, విజయవాడకు 64, తిరుపతికి 143, కర్నూలుకు 34, ఇతర ప్రాంతాలకు 424 బస్సుల చొప్పున నడపనున్నామని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే మరిన్ని సర్వీసులు నడుపుతామన్నారు. అలాగే ఈనెల 19 నుంచి 21 వరకు తిరుగు ప్రయాణంలో కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నామని చెప్పారు.

తపాలా కార్యాలయాల్లో ‘దసరా’ ప్రసాదం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి దసరా ప్రసాదాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని తపాలా కార్యాలయాల ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కడప డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఎ.రాజేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా పర్వదినాలను పురస్కరించుకుని భక్తులు విజయవాడకు వెళ్లకుండానే కనకదుర్గ అమ్మవారి దసరా ప్రసాదాన్ని తపాలా కార్యాలయాల ద్వారా పొందే సౌకర్యం కల్పించనట్లు వివరించారు. ఒక్కో ప్రసాదం ప్యాకెట్‌ ధర రూ.116తో అందిస్తున్నట్లు తెలిపారు. ప్రసాదం ప్యాకెట్‌లో కనకదుర్గ అమ్మవారి లాకెట్‌, శక్తి కంకణం/కంకణం దారం, కుంకుమ, అక్షింతలు, కనకదుర్గ ప్రభ పుస్తకం ఉంటాయని వివరించారు.

అగ్రిగోల్డ్‌ బాండ్ల స్వీకరణకు ఏర్పాట్లు

కడప అర్బన్‌: అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి ఒరిజినల్‌ బాండ్ల స్వీకరణ ప్రక్రియను ఈనెల 9 నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న ఆర్‌ఎస్‌ఐ కార్యాలయంలో ప్రారంభించనున్నా రు. మండలాల వారీగా బాండ్లను స్వీకరించనుండగా, ఇందులో భాగంగా తొలిదశలో 9, 10 తేదీల్లో సిద్ధవటం మండల బాధితుల బాండ్లను తీసుకోనున్నారు. మిగిలిన మండలాల తేదీలను తదుపరి ప్రకటిస్తారు. బాధితులు అసలు అగ్రిగోల్డ్‌ బాండ్‌, దాని స్వీయ ధ్రువీకరించిన కలర్‌ జిరాక్స్‌ (నకలు), ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం తీసుకురావాలని అధికారులు సూచించారు. నామినీ బాండ్‌ సమర్పిస్తే నామినీ గుర్తింపు పత్రంతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలి. డిపాజిటర్‌ మరణించి ఉంటే మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు వారసత్వం, బంధుత్వానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని అధికారులు సూచించారు.బాధితులు తమకు కేటాయించిన తేదీల్లోనే హాజరు కావాలని అధికారులు సూచించారు.

నేటి నుంచి మెడికల్‌క్యాంపులు

మదనపల్లె సిటీ: నూతన జిల్లాల పునర్విభజన ఉత్తర్వుల –2026 ప్రకారం ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ పాయింట్లు పొందేందుకు అర్హులైన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మెడికల్‌ క్యాంపునకు హాజరై తమ ధ్రువపత్రాలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. తిరుపతిలోని రూయా ఆస్పత్రిలో ఉదయం 10 నుంచి 4 గంటల వరకు మెడికల్‌ క్యాంపులు ఉంటాయని వివరించారు 9వతేదీ తిరుపతి డివిజన్‌, 12వతేదీ పుత్తూరు డివిజన్‌, 13వతేదీ మదనపల్లె డివిజన్‌, 14వతేదీ చిత్తూరు డివిజన్‌ వారికి మెడికల్‌ క్యాంపులు జరుగుతాయన్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేత సిబ్బంది తమకు కేటాయించిన తేదీలలో తప్పనిసరిగా హాజరై అవసరమైన ఽవైద్యపత్రాలు, ధ్రువపత్రాలను సమర్పించి ధ్రువీకరించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement