స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

సాక్షి, మదనపల్లె: స్థానికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లిలను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీపీఓ రాధమ్మ పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల మ్యాపింగ్‌, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సామగ్రి సమీకరణ, పోలింగ్‌ సిబ్బంది నియామకం, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, స్టాట్యూటరీ, నాన్‌–స్టాట్యూటరీ ఫారాల సమీకరణ, భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ప్రణాళిక తదితర అంశాలపై కమిషనర్‌ సమీక్షించారు. పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశంపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను కమిషనర్‌ తెలుసుకున్నారు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను సిద్ధంచేసి ఉంచామని తెలిపారు. జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శక నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తొలగించిన ఓటర్లను చేర్చుతాం

ప్రత్యేక సమగ్ర సవరణలో పొరబాటుగా తొలగించిన, అనర్హులుగా తేల్చిన ఓటర్ల వివరాల పునఃపరిశీలన చేపట్టి వారిని మళ్లీ ఓటర్లుగా నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పునఃపరిశీలిస్తారని అర్హులైన ఓట్లు, పొరపాటున తొలగించినట్లుగా తేలితే కొత్తగా ఓటు నమోదు కోసం వారితో ఫారం–6 స్వీకరించి పరిశీలన తర్వాత వారి పేరు ఓటర్ల జాబితాలో చేర్చడం జరుగుతుందని తెలిపారు.

కలెక్టర్‌, ఎస్పీలకు ఎస్‌ఈసీ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement