రాయచోటి అర్బన్ : ప్రతి ఇంటిపైన సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వినియోగదారులకు లాభదాయకమని జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటి ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ ముప్త్ బుజ్ యోజన సేతు అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో అందిస్తున్న సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో 90 శాతం వరకు విద్యుత్ బిల్లులు తగ్గుతాయన్నారు. దీంతో పాటు 2 కిలో వాట్ల ప్లాంట్‌కు రూ.60వేలు, 3 లేదా అంత కంటే ఎక్కువ కిలో వాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.78వేలు వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సోలార్ రూప్‌టాప్ కోసం వినియోగదారులు ఎలా ధరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని ఆయన వివరించారు. కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ అఽధికారి బాలు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు జయప్రకాశ్, వరప్రసాద్ రెడ్డి, నాగముని స్వామి, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఉద్యోగులు, వినియోగదారులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈ సోమశేఖర్ రెడ్డి


