రాక రాక వచ్చిన వర్షం బీభత్సం చేసింది. వర్షానికి పిడుగులు తోడవడంతో పల్లె సీమ ఉలిక్కిపడింది. పిడుగు పాటుకు ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది.. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి గ్రామం అంధకారమైంది. మరో చోట మూగజీవాలు మృత్యువాత పడగా.. ఇంకోచోట భారీ వృక్షం నేలకొరిగి ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
వాల్మీకిపురం: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విఠలం సమీపంలోని పాదాల మండపం వద్ద భారీ వృక్షం విరిగి మదనపల్లి–తిరుపతి పాత జాతీయ రహదారికి అడ్డంగా పడిపోయింది. దాదాపు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అధికారులు రోడ్లపై అడ్డంగా పడిన వృక్షాన్ని తొలగించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది.
సాక్షి, మదనపల్లె: జిల్లాలో సోమవా రం రాత్రి భారీ వర్షం కురిశాయి. వాయల్పాడులో అత్యధికంగా 92.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా కలకడలో అత్యల్పంగా 1.6 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. గాలివీడులో 42.2 మి.మీ, చిన్నమండెంలో 31.2, సంబేపల్లిలో 18.6, రాయచోటిలో 88.6, లక్కిరెడ్డిపల్లిలో 48, రామాపురంలో 22.2 మొలకలచెరువులో 82, తంబళ్లపల్లెలో 40, పెద్దమండ్యంలో 45.4, కురబలకోటలో 40, పెద్ద తిప్ప సముద్రంలో 32.2, బి.కొత్తకోటలో 44, మదనపల్లెలో 49.4, నిమ్మనపల్లిలో 38.2, చౌడేపల్లిలో 28.4, రామసముద్రంలో 65.2, పుంగనూరులో 52.4, గుర్రంకొండలో 24, కె.విపల్లిలో 10.2, పీలేరులో 27.2, కలికిరిలో 6.6, సదుంలో 13.2, సోమలలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
జిల్లాలో వర్షాలు


