కడప ఎడ్యుకేషన్: చదువుతో సామాజిక బాధ్యత వస్తుందని సమాజాన్ని, దేశాన్ని మెరుగుపరిచేలా మన ప్రతి చర్య ఉండాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. వైవీయూ పరిధిలోని జాతీయ సేవా పథకం ఉత్తమ వలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ప్రిన్సిపాల్‌లకు 2025 –26 సంవత్సరానికి విశ్వవిద్యాలయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవాన్ని వైవీయూ ప్రాంగణంలోని అన్నమాచార్య సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం వ్యక్తి నిర్మాణాన్ని ఉన్నతంగా నిలుపుతుందన్నారు. రెక్టార్ ఏజి దాము, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్సీ గంగిరెడ్డి ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం సుభోష్ చంద్ర వలంటీర్ల సేవకులను కొనియాడారు. అనంతరం ఏడాది పాటు సమాజానికి అత్యుత్తమ సేవలదించిన వలంటీర్లను, ప్రోగ్రాం ఆఫీసర్లను, ప్రిన్సిపాల్‌లను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు.
ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
జి. ఉమా శంకర్, (ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, కడప), పవిత్ర (ప్రభుత్వం. మహిళా డిగ్రీ కళాశాల, పులివెందుల), ఎన్.అజయ్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెండ్లిమర్రి), కూలి హరి (యోగి వేమన యూనివర్సిటీ కాలేజ్, కడప), పగడాల సుభాష్,యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల, కడప), జిలకల రాఘవేంద్ర, (యోగి వేమన యూనివర్సిటీ కాలేజ్, కడప), ఈడిగ కోటీశ్వర్, (యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల, కడప)
ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్లు వీరే.....
డాక్టర్ వై.నాగేంద్రమ్మ, (యస్‌వీ ఆర్‌ఎం ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాల, పులివెందుల), వి. ప్రసన్న కుమార్ (ఎ. పి. మోడల్ స్కూల్ – జూనియర్ కాలేజ్, రాయచోటి), కె. వెంకట నరసయ్య (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజంపేట), డా. పి. శచీ దేవి, (ఎస్ కే ఆర్ ఎస్ కే ఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ కడప), అనంత లక్ష్మి, (నాగార్జున డిగ్రీ మహిళా కళాశాల, కడప.), ఇ. నిఖిల ప్రియ, (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెండ్లిమర్రి), డాక్టర్ యర్రబండి వరలక్ష్మి, డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, కడప.), పి. శివ రామ కృష్ణ, (ప్రభుత్వ పురుషుల కళాశాల కడప),ప్రొఫెసర్ ఎం. అనిత,( యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల, కడప), ప్రొఫెసర్ కె. లలిత (యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల)


