పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

మదనపల్లి (కురబలకోట): జిల్లాలో వివిధ ఇంజినీరింగ్‌ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ ఇంజినీరింగ్‌ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ పనులపై కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే రహదారులు, తాగునీరు, విద్యుత్‌,సాగునీరు, ఆసుపత్రులు, పాఠశాలల పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాప్యాన్ని సహించబోమని నాణ్యతలో రాజీ లేకుండా పనులను వేగ వంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

గ్రామీణులకు చేరువగా వైద్య సేవలు

సాక్షి, మదనపల్లె: ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌–విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లతో గ్రామీణులకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువయ్యాయని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ 267 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌–విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లాకు సంబంధించి మూడు కేంద్రాలను కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిధులతో గాలివీడు మండలం తూముకుంటలో రూ.16.50 లక్షలు, మండల కేంద్రం లక్కిరెడ్డిపల్లిలో రూ.11 లక్షలు, పెద్దమండ్యం మండలం నత్తిఓబన్నగారిపల్లిలో రూ.17.88 లక్షలతో భవనాలను ప్రారంభించినట్లు తెలిపారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు గ్రామీణులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక సేవలు అందించడమే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఉద్దేశ్యమన్నారు. డీఎంహెచ్‌ఓ వై.శ్రీనివాసులు, డీపీఎంఓ డాక్టర్‌ బి. రమేష్‌ బాబు, డీఎంఓ డాక్టర్‌ వెంకటరమణ రెడ్డి, వైద్య సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement