రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

జిల్లా వ్యవసాయశాఖ అధికారి హరిప్రియ

పెద్దమండ్యం: తీవ్ర వర్షాభావం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి హరిప్రియ అన్నారు. పెద్దమండ్యం రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు అందుబాటులో ఉన్న ఎరువులు, పంపిణీ చేసిన ఎరువుల వివరాలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అసిస్టెంట్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎరువుల పంపిణీ, ఈకేవైసీ, ఈ క్రాప్‌ నమోదుపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆరుతడి పంటలు సాగు చేసుకొనేలా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం జిల్లాలో ఉన్న ఆన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. రబీ సీజన్‌లో వ్యవసాయబోర్ల కింద వేరుశెనగ సాగు చేసే రైతులకు రాయితీపై విత్తనాలను అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు రాయితీపై ఇస్తున్న ఉలవలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మజీద్‌అహ్మద్‌, ఏవో సురేష్‌బాబు, ఏఈవో శివకుమార్‌, సిబ్బంది భవ్య, మహేష్‌నాయక్‌, మల్లికార్జున, కీర్తి, ఆనుదీప్‌, సుగుణమ్మ, షమీనా, మద్దక్క, కదిరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement