విద్యుత్‌ షాక్‌తో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో ఒకరి మృతి

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

రామాపురం : మండలంలోని బండపల్లి గ్రామ సమీపంలో ఫారెస్ట్‌ ఆఫీసు వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటో నగర్‌ నుంచి రేకుల బంకును ట్రాక్టర్‌లో తరలిస్తుండగా.. పైభాగంలో ఉన్న విద్యుత్‌ తీగలకు రేకుల బంకు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్‌లో రాయచోటి ట్రంకురోడ్డుకు చెందిన షేక్‌ మహమ్మద్‌ ఇలియాస్‌కు సంబంధించిన రేకుల బంకును తరలిస్తున్నారు. బండపల్లి ఫారెస్ట్‌ ఆఫీసు సమీపంలోకి రాగానే రేకుల బంకు విద్యుత్‌ తీగలకు తగలడంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇర్ఫాన్‌ఖాన్‌తోపాటు కూలీలు షేక్‌ జాఫర్‌, షేక్‌ ఇర్ఫాన్‌ అలీ, పఠాన్‌బాబ్జీ, షేక్‌ మహమ్మద్‌ విద్యుత్‌ షాక్‌కు గురై గాయాల పాలయ్యారు. అదే ట్రాక్టర్‌లో ఉన్న సయ్యద్‌ జబీబుల్లా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని, మృతదేహాన్ని అంబులెన్స్‌లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై రామాపురం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరో ఐదుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement