స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయం

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

● కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

రొంపిచెర్ల : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికలంటే భయ పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలలో ఓడి పోతామని పోలీసుల సాయంతో వైఎస్సార్‌సీపీ వారిని బెదిరించి గెలవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాయలసీమ కరువుతో అల్లాడుతోందన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా చూస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని చెబుతున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీలో కష్ట పడే వారికి పదవులు ఇచ్చామని అన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ పార్టీ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందని పేర్కొన్నారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3000 ఇస్తామని హామీలు ఇచ్చిందన్నారు. అయితే ఇప్పుడు 18 ఏళ్లు నిండిన యువతులకు రూ.1500 ఇవ్వాలంటే.. ఏపీని అమ్మేసినా ఇవ్వలేమని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి.. నేడు వాటిని అమలు చేయకుండా చేతులు పైకి ఎత్తి వేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే తీవ్ర కరువు వస్తుందన్నారు. కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం కన్నెతి చూడడం లేదన్నారు. కూటమి పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే 90 శాతం స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీలు చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, సురేంద్రరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చెంచురెడ్డి, కోటా వెంకటరమణ, నాథమునిరెడ్డి, రెడ్డిశ్వర్‌రెడ్డి, పోకల ఆశోక్‌కుమార్‌, డి.హరినాథరెడ్డి, డాక్టర్‌ శ్రీనాథ్‌, కరీముల్లా, విజయశేఖర్‌, రవీంద్ర, బాలాజీ, రెడ్డిశేఖర్‌రెడ్డి, బావాజీ, సైపూలాఖాన్‌, ఓబులేసు, మహబుబ్‌బాషా, అల్లాబక్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement