అయ్యో.. పాపం..! | - | Sakshi
Sakshi News home page

అయ్యో.. పాపం..!

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

పుంగనూరు : సాధారణంగా ఎవరైనా పార్టీ మారితే కొత్తగా చేరిన పార్టీలో మొదట్లో అత్యంత గౌరవం ఉంటుంది. తర్వాత తగ్గుతూ వచ్చి ప్రాధాన్యత కోల్పోతూ కార్యకర్త స్థాయికి గౌరవం పడిపోతుంది. ఈ పరిస్థితి పుంగనూరు ముస్లిం అంజుమన్‌ కమిటీ కార్యదర్శి ఇబ్రహీంకి అక్షరాల సరిపోతుందని స్థానికులు అంటున్నారు. పుంగనూరు అంజునన్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.ఇబ్రహీంతో కలసి తెలుగుదేశం నాయకులు గత నెల 30న మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఒక కూటమి నేత ఇంటిలో తెలుగుదేశం నూతన ఇన్‌చార్జ్‌ మధుసూదన్‌నాయుడుతోపాటు ఇబ్రహీం కూడా విందు భోజనానికి వెళ్లాడు. ఈ సమయంలో అందరూ దర్జాగా డైనింగ్‌ టేబుల్‌పై కూర్చొని విందు భోజనం చేస్తూ, అంజుమన్‌ సెక్రటరీ ఇబ్రహీంను మాత్రం కింద కూర్చోబెట్టి భోజనం పెట్టారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో టీడీపీపై ముస్లింలు మండిపడుతున్నారు. కాగా మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిలు పుంగనూరులో ఎప్పుడు ఎవరితో సమావేశాలు నిర్వహించినా.. అన్ని కులాలకు, మతాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గౌరవించడం సాధారణమైంది. కానీ కూటమి నాయకులు ముస్లింలను అవమానించడం ఆందోళనలకు రేకెత్తిస్తోంది. పట్టణంలో ముస్లిం సంఘంలో అత్యంత విలువైనది అంజుమన్‌ కమిటీ. అలాంటి కమిటీకి కార్యదర్శిగా ఉన్న ఇబ్రహింహీంను అవమానించడంపై ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని, ముస్లింలకు కూటమి ప్రభుత్వంలో విలువ లేదని ఆరోపిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ముస్లిం కుటుంబాలను కలవర పరుస్తోంది. మేధావి వర్గం సైతం ఇబ్రహీంకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నారు.

ముస్లింను అవమానించిన టీడీపీ

క్రమశిక్షణకు, నిజాయతీ పనితీరుకు నిదర్శనంగా ఉన్న ముస్లిం కుటుంబాలను తెలుగుదేశం వారు అవమానించడం బాధకరమని ఎంపీ మిథున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కల్లబొల్లి మాటలతో ముస్లిం ఓట్లను ఆకట్టుకునేందుకు తప్పుడు హామీలు ఇస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. పైన కూర్చొని ప్రగల్భాలు పలకడం కాదు. స్థానికంగా ముస్లింలు ఎంత అవమానాలకు గురౌతున్నారో చూడాలి. ముస్లింలను అవమానించే వారెవరైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

తెలుగుదేశం పార్టీలో

ఇదీ మైనార్టీ నేతకు గౌరవం

వైఎస్సార్‌సీపీలో

ముఖ్య నేతల పక్కనే పెద్దపీట

పుంగనూరు మైనార్టీల్లో చర్చనీయాంశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement