నిశ్శబ్ద జీవితంలో వెలుగు | - | Sakshi
Sakshi News home page

నిశ్శబ్ద జీవితంలో వెలుగు

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

● పెద్ద మనసు చాటుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి

● రూ.6 లక్షల కాక్లియర్‌ ఇంప్లాటేషన్‌ మిషన్‌ అందజేత

● మాట రాని యువతికి మాట వచ్చిన వైనం

మదనపల్లి (కురబలకోట) : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పెద్ద మనసు చాటారు. మూగకు మాట తెప్పించే రూ.6 లక్షల విలువైన కాక్లియర్‌ ఇంప్లాటేషన్‌ మిషన్‌కు ఎంపీ నిధులు మంజూరు చేసి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఎంపీ చేతుల మీదుగా బాధిత యువతి కీర్తన (25)కు అందజేశారు. వివరాలలోకి వెళితే.. మండలంలోని కనసానివారిపల్లికి చెందిన ఎం.కీర్తన పుట్టుకతో చెవుడు, మూగతో బాధపడేది. ఎన్నో ఏళ్లుగా నిశ్శబ్దంతోనే సైగల జీవితం సాగించింది. ఈమె బీకాం కంప్యూటర్స్‌ వరకు చదివారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2009–10లో అప్పట్లో హైదరాబాదులోని మా హాస్పిటల్‌లో చికిత్స చేయించారు. మెదడులో చిఫ్‌ లాంటి మిషన్‌ ఏర్పాటు చేసి స్పీచ్‌ థెరపి, వైద్య పరీక్షలు, మ్యాపింగ్‌ లాంటివి చేశారు. రెండేళ్లకు పైగా ఆసుపత్రిలో గడిపారు. అప్పుడే రూ.5 లక్షలకు పైగా ఖర్చయింది. పూర్తిగా అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వమే భరించింది. కీర్తన మాట్లాడేందుకు, వినేందుకు దోహదపడే కాంక్లియర్‌ ఇంప్లాటేషన్‌ మిషన్‌ అందజేశారు. దీంతో ఆమెకు మాట వచ్చింది. వినగలిగింది. మూగకు మాట రావడంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఏళ్లు గడచిపోవడంతో కాలక్రమంలో ఆ మిషన్‌ దెబ్బతిని పనిచేయకుండా పోయింది. కీర్తన సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఒకప్పుడు మాట్లాడ గలిగి వినగలుగుతున్న కీర్తనకు మిషన్‌ లేకపోవడంతో.. ఆమె జీవితం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. ఈ విషయాన్ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దృష్టికి నాయకులు తీసుకెళ్లారు. చలించిన ఆయన వెంటనే కాక్లియర్‌ ఇంప్లాటేషన్‌ మిషన్‌ కోసం తన నిధుల నుంచి రూ.6 లక్షలు మంజూరు చేశారు. ఆమె జీవితంలో కొత్త ఆశలకు బాటలు వేశారు. ఇటీవల ఆ మిషన్‌ హైదరాబాదు నుంచి రాగా మదనపల్లి పర్యటనలో ఎంపీ చేతుల మీదుగా కుటుంబ సభ్యుల సమక్షంలో కీర్తనకు అందజేశారు. కీర్తనతో పాటు కుటుంబీకులు ఒక్కసారిగా బాగోద్వేగానికి గురయ్యారు. కీర్తన కూడా ఎంతగానో సంతోషించింది. ఎంపీ ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. నిశ్శబ్ద జీవితంలో కొత్త ఆశల వెలుగు నింపడంతో ఎంపీ చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement