మదనపల్లె టౌన్ : భవనానికి పెయింటింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి కిందపడి ఓ పెయింటర్ తీవ్రంగా గాయపడిన ఘటన మదనపల్లెలో చోటు చేసుకుంది. ఘటనపై తాలూకా పోలీసుల కథనం మేరకు వివరాలు... పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన శ్రీనివాసులు(25) మంగళవారం మదనపల్లె పట్టణంలోని అంకిశెట్టిపల్లిలో ఓ నూతన భవనానికి పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి మిద్దైపె నుంచి కింద పడిపోయాడు. దీంతో అతనికి తలకు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన తోటి కార్మికులు, ఇంటి యజమాని స్పందించి బాధితున్ని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పరిశీలిస్తున్నారు. బాధితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై అస్పత్రి ఔట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు.
వేటగాళ్ల నాటుబాంబు పేలి..
బి.కొత్తకోట (మదనపల్లె టౌన్) : వన్యప్రాణుల వేట కోసం అమర్చిన నాటు బాంబు పేలి కుక్క మృతి చెందిన ఘటన మండలంలో వెలుగుచూసింది. ఘటనపై స్థానికులు, బి.కొత్తకోట పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రఘునాథపురానికి చెందిన బిజిలి కృష్ణప్పకు చెందిన కుక్క మంగళవారం సమీపంలోని అడవి దగ్గర పొలాల్లో తిరుగుతుండగా, వేటగాళ్లు అమర్చిన నాటు బాంబును కొరికింది. దీంతో బాంబు పేలి కుక్క తల రెండుగా చీలి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కొంత కాలంగా కొందరు వ్యక్తులు అడవి పరిసరాల్లో నాటు బాంబులు అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ముగ్గురిపై అనుమానం ఉందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితుడు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
పెయింటర్‌కు తీవ్ర గాయాలు
కుక్క మృత్యువాత


