ఆక్రమిత ప్రభుత్వ భూమి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఆక్రమిత ప్రభుత్వ భూమి స్వాధీనం

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

పెద్దతిప్పసముద్రం : మండలంలోని పట్టెంవాండ్లపల్లి పంచాయతీ వడ్డిపల్లి సమీపంలో గోశాలగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎరబల్లికి చెందిన పలువురు వ్యక్తులు జేసీబీలతో చదును చేస్తూ ఆక్రమించిన విషయం పాఠకులకు తెలిసిందే. దర్జాగా పట్ట పగలు ప్రభుత్వ భూమి దురాక్రమణపై.. మంగళవారం సాక్షి పత్రికలో వెలువడిన ‘ప్రభుత్వ జాగా–వేసేయ్‌ పాగా’ కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్‌ శ్రీరాములు నాయక్‌ ఆదేశాల మేరకు ఆర్‌ఐ హుసేన్‌, వీఆర్వో శేఖర్‌ ఆ స్థలం వద్దకు వెళ్లారు. సర్వే నంబర్‌ 2లో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమార్కులు చదును చేసిన ఆక్రమిత స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభు త్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా స్వాధీనం చేసుకున్నా, భూమిలోకి ప్రవేశించినా కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఫిర్యాదు చేసిన రైతుల నుంచి, అక్రమార్కుల నుంచి అధికారులు లిఖిత పూర్వకంగా వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement