గుర్రంకొండ: మినిలారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బైక్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మండలకేంద్రమైన గుర్రంకొండకు సమీపంలొ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన ఆర్. రామాంజులు నాయుడు(57), ఎ. మధు(31) కోళ్ల ఫారాల వద్ద కోళ్ల లోడింగ్, అన్‌లోడింగ్ వంటి కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం గుర్రంకొండ పరిసరాల్లోని కోళ్ల ఫారాల వద్ద లోడింగ్ పనులు చేయడానికి అరికెల గ్రామం నుంచి ద్విచక్రవాహనంలో ఇద్దరు బయలు దేరారు. రాజంపేట నుంచి అరటికాయలలోడుతో మినిలారీ మదనపల్లెకు వెళుతోంది. గుర్రంకొండకు సమీపంలో ఇండియన్‌డాబా వద్ద ద్విచక్రవాహనాన్ని మినిలారీ ఢీకొంది. మినీలారీ కొద్దిదూరం వెళ్లి బోల్తాపడింది. కాగా బైక్‌లో ప్రయాణిస్తున్న రామాంజులు నాయుడు, మధులు తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు.


